
‘జీవితం ఎంతో అందమైనది కదూ... తల్లిదండ్రుల ప్రేమానుగారాలు, టీనేజ్‌లో ప్రేమాయణాలు, అలకలు, సరదాలు... జీవితంలో ఎన్ని ఉంటాయో కదూ’ అని చెబుతున్నారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓకే బంగారం’ ఫేమ్ దుల్కర్ సల్మాన్‌కి జోడీగా ఆమె నటించిన మలయాళ సినిమా ‘జొమోంటే సువిశేషంగాళ్’. ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్.
మలయాళంలో 50కోట్ల వరకూ వసూలు చేసిన ఈ సినిమాను పత్తిపాటి శైలజ సమర్పణలో మేఘవర్ష క్రియేషన్స్ పతాకంపై ‘అందమైన జీవితం’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ నెల 13న తీసుకొస్తున్నారు నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు. ఆయన మాట్లాడుతూ–‘‘తండ్రీకొడుకల మధ్య అనుబంధాన్ని, ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించే చిత్రమే ‘అందమైన జీవితం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విద్యాసాగర్.