‘అమ్మమ్మ గారిల్లు’ ఫస్ట్‌ సింగిల్‌ | Ammamma Garillu First Single Out | Sakshi
Sakshi News home page

May 6 2018 3:59 PM | Updated on May 6 2018 6:58 PM

Ammamma Garillu First Single Out - Sakshi

ఛలో సినిమాతో సక్సెస్‌​ కొట్టి దూకుడు మీదున్నాడు కుర్ర హీరో నాగశౌర్య. పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్రలో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛలో సక్సెస్‌తో ఫాంలో ఉన్న నాగశౌర్య ప్రస్తుతం అమ్మమ్మ గారిల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల రిలీజ్‌ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘చాలా చాలా...’ అంటూ సాగే పాటను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. ఈ లిరికల్‌ వీడియోను చూస్తే... ఓ పండుగ వాతావరణంలా అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు. భాస్కరభట్ల సాహిత్యం... కల్యాణ రమణ, గీతా మాధురి గాత్రం... కల్యాణ రమణ సంగీతం ఆకట్టుకున్నాయి. నాగ శౌర్యకు జోడిగా ఓయ్‌ ఫేం షామిలి నటిస్తోంది. స్వాజిత్‌ బ్యానర్‌పై రాజేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, సుందర్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement