విఐపి 2 టీజర్ రిలీజ్ చేసిన బిగ్ బి | Amitabh Bachchan launches Dhanushs VIP 2 teaser | Sakshi
Sakshi News home page

విఐపి 2 టీజర్ రిలీజ్ చేసిన బిగ్ బి

Jun 7 2017 4:24 PM | Updated on Sep 5 2017 1:03 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విఐపి 2. 2014లో ఘనవిజయం సాధించిన విఐపి సినిమాకు సీక్వల్ గా ఈ సినిమానూ రూపొందిస్తున్నారు. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ మాటలు అందించటంతో పాటు తానే స్వయంగా నిర్మిస్తున్నాడు ధనుష్.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.ధనుష్ యాక్షన్ సీన్స్తో పాటు, సముద్రఖని చెప్పిన డైలాగ్ తో సింపుల్ గా టీజర్ ను డిజైన్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి ధనుష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement