సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అమీ తుమీ' | ami tumi censor completed | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అమీ తుమీ'

May 27 2017 1:34 PM | Updated on Jul 14 2019 4:31 PM

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అమీ తుమీ' - Sakshi

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'అమీ తుమీ'

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్పై అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ 'అమీ తుమీ'. వెన్నెలకిషోర్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'యు' సర్టిఫికెట్ అందుకొంది. కామెడీ ఎంటర్ టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. 'మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన బాణీలన్నీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ట్రైలర్కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఇంద్రగంటి గారు మంచి ఎంటర్ టైనర్గా 'అమీ తుమీ' చిత్రాన్ని తెరకెక్కించారు. అవసరాల, అడివి శేష్ల క్యారెక్టర్, వెన్నెల కిషోర్ నెగిటివ్ షేడ్లో పండించే కామెడీ సినిమాకి హైలైట్గా నిలిస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 9న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ'న్నారు.

Advertisement
 
Advertisement
Advertisement