
ఎప్పటికైనా ఆయనతో చేస్తా!
మధుర్ భండార్కర్ ‘మేడమ్‌జీ’ లో హీరోయిన్‌గానే కాకుండా ఆ సినిమాతో నిర్మాతగా కూడా మారాలనుకున్నారు ప్రియాంకా చోప్రా. కానీ తన బిజీ షెడ్యూల్‌తో ప్రియాంక కోరిక తీరలేదు.
మధుర్ భండార్కర్ ‘మేడమ్‌జీ’ లో హీరోయిన్‌గానే కాకుండా ఆ సినిమాతో నిర్మాతగా కూడా మారాలనుకున్నారు ప్రియాంకా చోప్రా. కానీ తన బిజీ షెడ్యూల్‌తో ప్రియాంక కోరిక తీరలేదు. ‘మేడమ్‌జీ’ కూడా సెట్‌కు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎలాగైనా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని బలంగా డిసైడైపోయారామె.
దాని గురించి ప్రియాంక మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ, కొత్తగా సినిమా తీయాలనే దే నా కోరిక. పైగా ఇప్పుడు రొటీన్ సినిమాలను ప్రేక్షకులను ఇష్టపడటం లేదు. హంగు, ఆర్భాటాల కన్నా విషయానికి ప్రాధాన్యమిస్తున్నారు. వారి అభిరుచికి తగ్గట్టే మనం మారాలి కదా. దానికి పెద్ద ఉదాహరణ ‘ఎన్ హెచ్ 10’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘పీకు’ చిత్రాలే. చాలా లో బడ్జెట్‌తోనే ఈ సిని మాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం.
అందరూ అనుకుంటున్నట్టు నేను శ్రద్ధా కపూర్‌ను సంప్రతించలేదు. మా దగ్గర కథే రెడీ కానప్పుడు ఇక మేము ఎవరిని అడుగుతాం’’ అని చెప్పారు. ‘మేడమ్‌జీ’ గురించి చెబుతూ -‘‘కథ బాగా కుదిరింది. కానీ దానికి చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇక నాకు వేరే కమిట్‌మెంట్స్ వ ల్ల ఈ సినిమా కుదర్లేదు. ఎప్పటికైనా మధుర్‌తో సినిమా చేస్తాను’’ అని ప్రియాంక చెప్పారు.