అడవుల్లో గాలింపు! | Allu Arjun fight with red sanders smugglers in Sukumar film | Sakshi
Sakshi News home page

అడవుల్లో గాలింపు!

Published Fri, May 10 2019 3:19 AM | Last Updated on Fri, May 10 2019 3:19 AM

Allu Arjun fight with red sanders smugglers in Sukumar film - Sakshi

శేషాచలం అడవుల్లో లొకేషన్స్‌ వెతికే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్‌. పనిలో పనిగా చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లోని లొకేషన్స్‌ను కూడా చుట్టి రావాలని అనుకుంటున్నారట. సడన్‌గా సుకుమార్‌ ఈ ఫారెస్ట్‌ ట్రిప్‌ ఎందుకు చేస్తున్నారు అంటే... నెక్ట్స్‌ సినిమా కోసం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కోసమే శేషాచలం అడవుల్లో లొకేషన్స్‌ గాలిస్తున్నారు సుకుమార్‌.

ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయట. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్‌ వర్క్‌ను ఆల్మోస్ట్‌ పూర్తి చేశారట సుకుమార్‌. ‘ఆర్య, అర్య 2’ సినిమాల తర్వాత సుకుమార్‌–అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌. అలాగే వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌: కనబడుటలేదు’ అనే సినిమాకు కూడా అల్లు అర్జున్‌ కమిట్‌మెంట్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement