ఫుల్‌ మీల్స్‌ నవ్వులు

Allari Naresh and Sunil Multistarrer Movie - Sakshi

‘అల్లరి’ నరేశ్‌ సినిమా అంటే ప్రేక్షకులకు నవ్వుల కితకితలే. ఆయన కామెడీకి నవ్వని ప్రేక్షకులుండ రేమో. ఇక సునీల్‌ అయితే.. కమెడియన్‌గా అయినా, హీరోగా అయినా ప్రేక్షకులను నవ్వించగలరు. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే, ప్రేక్షకులకు డబుల్‌ ధమాకానే. ఇంకా చెప్పాలంటే ఈ కాంబినేషన్‌ అంటే ఫుల్‌మీల్స్‌ నవ్వులే. ‘తొట్టిగాం్యగ్‌’ సినిమాలో స్నేహితులుగా నవ్వులు పంచిన వీరిద్దరూ పదిహేనేళ్ల తర్వాత మరోసారి కలిసి నటించనున్నారు.

ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారట. ఈ చిత్రంలో హీరోకి సమానంగా ఉండే పూర్తి స్థాయి పాత్ర చేయనున్నారు సునీల్‌. సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమవుతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా నిర్మించిన బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ‘అల్లరి’ నరేశ్‌–భీమనేని శ్రీనివాసరావు కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘సుడిగాడు’కి సంగీతం అందించిన శ్రీ వసంత్‌ ఈ సినిమాకి స్వరకర్త అని సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top