నా కూతురుకి సలహాలు అక్కర్లేదు: నటి తల్లి | Alia Bhatt doesn’t need my guidance: Soni Razdan | Sakshi
Sakshi News home page

నా కూతురుకి సలహాలు అక్కర్లేదు: నటి తల్లి

Jul 15 2017 4:21 PM | Updated on Apr 3 2019 6:34 PM

నా కూతురుకి సలహాలు అక్కర్లేదు: నటి తల్లి - Sakshi

నా కూతురుకి సలహాలు అక్కర్లేదు: నటి తల్లి

అతి పిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న నేచురల్‌ బ్యూటీ, బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ అలియా భట్‌ను చూసి ఆమె తల్లి ఎంతో ముచ్చటపడుతోందట.

ముంబయి: అతి పిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న నేచురల్‌ బ్యూటీ, బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ అలియా భట్‌ను చూసి ఆమె తల్లి ఎంతో ముచ్చటపడుతోందట. తండ్రి మహేశ్‌ భట్‌, సోదరి షహీన్‌ భట్‌ కూడా అలియా గురించి తెగ గర్విస్తుంటారని, నలుగురితో చెప్పుకుంటూ సంబరపడిపోతుంటారని ఆమె తల్లి సోనీ రజ్దాన్‌ అంటున్నారు.

ఏ సినిమాలు చేయాలి? ఏవి చేయకూడదు అనే విషయంలో తాము తమ కూతురుకి సలహాలు ఇవ్వనవసరం లేదని, తానే స్వయంగా ఎంచుకొని నటించగలుగుతుందని, ఇప్పటికే ఆ విషయాన్ని కూడా నిరూపించుకుందని తెలిపారు. తాము ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే అది చేసే పనిలో అంకిత భావం ఉండాలని, ప్రతి రోజూ ఎంతో కొంత మెరుగును చూపించగలగాలని, కష్టపడి పనిచేసే మనస్తత్వం అలవాటు చేసుకోవాలని మాత్రమే చెబుతామన్నారు. ఒక తల్లిగా తానెప్పుడూ అలియాతోనే ఉంటానని, కానీ, వృత్తిరీత్యా, వ్యక్తిగతంగా ఎలా ఉండాలో తనకు తెలుసని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement