మాట కోసం..

Alia Bhatt to do Gangubai with Sanjay Leela Bhansali - Sakshi

బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్‌ అయినా చాలా సంతోషపడుతుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘ఇన్‌షా అల్లా’ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్‌ అయినప్పుడు ఆలియా అలా ఫుల్‌ హ్యాపీ ఫీలయ్యారు. కానీ సల్మాన్‌ – భన్సాలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఆ సినిమా ఆగిపోయింది. దీంతో ఆలియా ఆశలు అవిరయ్యాయి.

‘ఇన్‌షా అల్లా’ సెట్స్‌పైకి వెళ్లకపోయినప్పటికీ తన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఆలియాకు ఇస్తానన్న భన్సాలీ ఇప్పుడు ఆమె కోసం ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో ఆలియాలో మళ్లీ ఆశ చిగురించిందట. వీటికి తోడు ఇటీవల భన్సాలీ ఆఫీసులో ఆలియా కనిపించడంతో సినిమా కన్ఫార్మ్‌ అని అందరూ ఫిక్సైపోతున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందట. ఇంతకుముందు భన్సాలీ ఇదే కథను ప్రియాంకా చోప్రాకు చెబితే ఆమె తిరస్కరించారట. మరి... ఆలియాతో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top