సౌదీలో విడుదల కానున్న తొలి బాలీవుడ్‌ మూవీ

Akshay Kumar Gold First Bollywood Movie Release in Saudi Arabia - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, మౌనీ రాయ్‌ జంటగా తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గోల్డ్’‌  . 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్‌ మెడల్‌ అందించిన కోచ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన తొలిరోజే 25.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది విడుదలైన సంజు, రేస్‌ 3 సినిమాల తర్వాత తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా బంగారం లాంటి సినిమా అంటూ ప్రశంసలు సైతం దక్కించుకుంది. తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. సౌదీ అరేబియాలో విడుదల కానున్న తొలి బాలీవుడ్‌ సినిమాగా ‘గోల్డ్‌’ చరిత్ర సృష్టించనుంది.

సంతోషంగా ఉంది..
‘భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన కథాంశంతో తెరకెక్కిన గోల్డ్‌ సినిమా సౌదీ అరేబియాలో విడుదల కాబోతుంది. తద్వారా సౌదీలో విడుదలవుతున్న తొలి బాలీవుడ్‌ సినిమాగా నిలవనుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కాగా కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఓ థియేటర్‌లో మొదటగా ‘బ్లాక్‌ పాంథర్‌’  సినిమాను ప్రదర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top