వర్మకు నాగ్‌ ఫ్యాన్స్ పాలాభిషేకం | Akkineni Fans Done Palabhishekam To RGV Cutout | Sakshi
Sakshi News home page

Jun 6 2018 10:06 AM | Updated on Jul 15 2019 9:21 PM

Akkineni Fans Done Palabhishekam To RGV Cutout - Sakshi

కింగ్‌ నాగార్జున, దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆఫీసర్‌ రిజల్ట్ ఏమైందన్న విషయం తెలిసిందే. నాగ్‌ కెరీర్‌ లోనే భారీ డిజాస్టర్‌ అనే స్థాయిలో ఉన్నాయి ఆఫీసర్‌ కలెక్షన్లు. ప్రస్తుతం వర్మ ఉన్న ఫాం గురించి పట్టించుకోకుండా నాగ్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. వర్మ వరుస ఫ్లాప్‌ల లిస్ట్‌ లో ఆఫీసర్‌ కూడా చేరిపోయింది. అయితే ఈ పరిస్థితుల్లో అక్కినేని అభిమానులను మరో అంశం భయపెడుతుంది.

ఆఫీసర్‌ రిలీజ్‌కు ముందే తన తదుపరి చిత్రం అఖిల్‌ హీరోగా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు వర్మ. నాగ్ కూడా వర్మ, అఖిల్‌ మధ్య చర్చలు జరుగుతున్న విషయాన్ని ధృవీకరించారు. దీంతో అక్కినేని అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ విషయంపై అక్కినేని అభిమానులు వినూత్నంగా స్పందించారు. అక్కినేని ఫ్యామిలీని వదిలేయాలని కోరుతూ వర్మ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement