మద్యం తాగి వాహనాలు నడిపితే? | akkadokaduntadu movie updates | Sakshi
Sakshi News home page

మద్యం తాగి వాహనాలు నడిపితే?

Dec 24 2018 3:24 AM | Updated on Dec 24 2018 3:24 AM

akkadokaduntadu movie updates - Sakshi

శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్‌ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞ దీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను సందేశాత్మకంగా మా సినిమాలో చూపిస్తున్నాం.

ప్రేక్షకులకు ప్రతిక్షణం ఉత్కంఠ కలిగించే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది’’ అన్నారు. ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆ ప్రేమజంట ఎలా బయటపడ్డారన్నదే చిత్ర ప్రధానాంశం’’ అని శ్రీపాద విశ్వక్‌ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహ నిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్‌.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement