మొదలైన అఖిల్‌ మూడో సినిమా!

Akhil And Venky Atluri New Movie Shooting Begins - Sakshi

‘అఖిల్‌’ సినిమాతో అక్కినేని అఖిల్‌కు దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తరువాత చాలా గ్యాప్‌ తీసుకుని విక్రమ్‌ కే కుమార్‌ డైరెక్షన్‌లో ‘హలో’ సినిమా చేశాడు. ఈ సినిమా విజయవంతమైనా.. కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేకపోయింది. అయితే ప్రస్తుతం అఖిల్‌ తన తదుపరి చిత్రంపై ఫోకస్‌ పెట్టాడు. 

మొదటి చాన్స్‌లోనే ‘తొలిప్రేమ’ లాంటి సినిమాను తీసి డైరెక్టర్‌గా తన టాలెంట్‌ చూపారు వెంకీ అట్లూరి. తన రెండో చిత్రంగా అఖిల్‌తో ఓ సినిమాను చేయబోతోన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ సినిమా షూటింగ్‌ ఈ రోజు (జూన్‌ 21) ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ఎస్‌వీసీసీ క్రియేషన్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించగా, తమన్‌ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ నటించనుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top