ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య | Akhil and Naga Chaitanya guest appearance in Sushanth Movie | Sakshi
Sakshi News home page

ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య

Aug 6 2016 2:11 PM | Updated on Sep 4 2017 8:09 AM

ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య

ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య

మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని...

మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని అభిమానులకు కనుల విందు చేశారు. ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఒకేసారి కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి నాగ్ లేకుండా వారసులిద్దరూ కలిసి ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు.

అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చిన మరో యంగ్ హీరో సుశాంత్ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. నాగచైతన్య చిన్న పాత్రలో నటిస్తుండగా.., అఖిల్ ఓ పాటలో సుశాంత్తో కలిసి స్టెప్పేయనున్నాడు. చాలా రోజులుగా హీరోగా ప్రూవ్ చేసుకోవటం కోసం కష్టాలు పడుతున్న బావ కోసం అఖిల్, నాగచైతన్యలు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అక్కినేని అందగాళ్లు సుశాంత్కు సక్సెస్ ఇస్తారో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement