20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ | Ajith's 'Veeram' audio launch on December 20 | Sakshi
Sakshi News home page

20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ

Dec 16 2013 2:26 AM | Updated on Sep 2 2017 1:39 AM

20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ

20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ

వీరం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆరంభం చిత్రం తరువాత అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న చిత్రం వీరం.

వీరం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆరంభం చిత్రం తరువాత అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న చిత్రం వీరం. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరువై శివా దర్శకుడు. నటి తమన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. యువతను అలరించే విధంగా రూపొందిన ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రం పాటలే కాదు చిత్రం కూడా జనరంజకంగా రూపొందిందని ముఖ్యంగా అజిత్ పాత్ర చాలా వైవిద్యభరితంగా ఉంటుందని, దర్శకుడు శివ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement