
పదహారేళ్ల తర్వాత..
‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటింది.
‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం విడుదలై ఏడు నెలలు దాటింది. ఆ సినిమా తర్వాత ఐశ్వర్యా రాయ్ ఏ చిత్రంలో నటిస్తున్నారు? ఎవరితో జోడీ కడుతున్నారు? బాలీవుడ్డా.. కోలీవుడ్డా.. టాలీవుడ్డా.. ఏ వుడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నకు ఐష్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాధానం రాలేదు కానీ, ఫలానా డైరెక్టర్‌తో, హీరోతో సినిమా అంటూ వార్తల మీద వార్తలు పుట్టుకొస్తున్నాయ్.
చిరంజీవి నటించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ఐష్ ఓ హీరోయిన్ అని టాక్. అలాగే, అనిల్ కపూర్‌తో దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ తెరకెక్కించనున్న ‘ఫ్యాన్నీఖాన్’లో ఐష్‌ని నాయికగా తీసుకోవాలనుకున్నారట. కథ నచ్చడంతో ఈ బ్యూటీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. 2000లో వచ్చిన ‘హమారా దిల్ ఆప్ కే పాస్ హై’ చిత్రంలో చివరిసారిగా అనిల్, ఐష్ జోడీ కట్టారు. ‘ఫ్యాన్నీఖాన్’లో ఐష్ కథానాయిక అన్నది వాస్తవమైతే పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిదే అవుతుంది.