సంక్రాంతి మూడ్లో ఎయిర్ పోర్ట్ | airport all in sankranti mood : aadi | Sakshi
Sakshi News home page

సంక్రాంతి మూడ్లో ఎయిర్ పోర్ట్

Published Tue, Jan 12 2016 12:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

సంక్రాంతి మూడ్లో ఎయిర్ పోర్ట్

సంక్రాంతి పండక్కి రెల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే కాదు ఎయిర్ పోర్ట్లు కూడా కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో సెలబ్రిటీలకు కూడా క్యూలో నిలబడటం తప్పేలా లేదు. ఈ రోజు( మంగళవారం) శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో పరిస్థితి ఎలా ఉందో తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు హీరో ఆది. భారీ క్యూ లైన్ల ముందు నిలబడి సెల్పీ దిగి ట్వీట్ చేశాడు. ఎయిర్ పోర్ట్లో కూడా సంక్రాంతి మూడ్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందిన ఆది ప్రస్తుతం తన తాజా చిత్రం 'గరం' రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సాఫ్ట్ చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించిన మదన్ ఈ సినిమాతో తొలిసారిగా మాస్ ఫార్ములాను ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఏడాది తండ్రి సాయి కుమార్ తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో.

 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement