మనసు మాట వినండి | Aditi Rao Hydari open up her Feelings | Sakshi
Sakshi News home page

మనసు మాట వినండి

Mar 15 2020 5:53 AM | Updated on Mar 15 2020 5:53 AM

Aditi Rao Hydari open up her Feelings - Sakshi

అదితీ రావ్‌ హైదరీ

ప్రతి ఒక్కరిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. తనలో ఉన్న ఓ బలహీనత తాను సెన్సిటివ్‌గా ఉండటమే అని అంటున్నారు హీరోయిన్‌  అదితీ రావ్‌ హైదరీ. ఈ విషయం గురించి ఆమె చెబుతూ – ‘‘నేను చాలా సున్నితమనస్కురాలిని. కొన్ని విధాలుగా ఇది నాకు ఉపయోగం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి మనస్తత్వం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. త్వరగా హర్ట్‌ అవుతాను. ఫీల్‌ అయిన విషయం నా ముఖం మీద కనిపించేస్తుంది. అలా నా ఫీలింగ్స్‌ని బయటపెట్టకూడదని ఫిక్స్‌ అయ్యాను. అలా ఉండగలనో లేదో చూడాలి’’ అన్నారు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మీరు ఎవరి మీద ఆధారపడతారు? అనే ప్రశ్నకు – ‘‘జనరల్‌గా మనం మన మనసు చెప్పే మాటను వినాలి. మనసు చెప్పినది ఎంత కష్టమైనా దాన్ని యాక్సెప్ట్‌ చేయాలి. నమ్మకంతో ముందుకెళ్లాలి ’’ అని పేర్కొన్నారు అదితీ రావ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement