ఫ్యాషన్‌ గాళ్‌!

Adah Sharma paired opposite Neil Nitin Mukesh in new film - Sakshi

సౌత్, నార్త్‌ అన్న తేడాలు లేకుండా ఎక్కడ మంచి పాత్రలు ఉంటే అక్కడ వాలిపోతున్నారు హీరోయిన్‌ అదా శర్మ. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఇందులో ఫ్యాషన్‌ గాళ్‌గా కనిపించనున్నారు అదా శర్మ. ఇందుకోసం ఆమె అప్పుడే లేటెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ‘‘చిన్నతనం నుంచే ఫ్యాషన్‌ సినిమాలు చూసే అలవాటు ఉంది. సో ఈ క్యారెక్టర్‌ నాకు బాగా సూట్‌ అవుతుందనుకుంటున్నాను. అలాగే నా పాత్రకు ఆడియన్స్‌ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారు.

యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉంది’’ అని చెప్పుకొచ్చారు అదా. ఇప్పటి వరకు హీరోయిన్‌ గురించే చెప్పాం. ఇప్పుడు హీరో విషయానికి వస్తే... బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ఇందులో హీరోగా నటించనున్నారు. ఇంకో విశేషం ఏంటంటే... నీల్‌ నితిన్‌ బ్రదర్‌ నామాన్‌ నితిన్‌ ముఖేష్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకునిగా పరిచయం కానున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేయడానికి టీమ్‌ ప్లాన్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌. అంటే తమ్ముడు డైరెక్షన్‌లో అన్నయ్య హీరో అన్నమాట. తెలుగులో ప్రభాస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమాల్లో నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top