ప్రేమ పరిహాసంగా మారుతోంది | Actress Varalaxmi Comments on love Vishal | Sakshi
Sakshi News home page

ప్రేమ పరిహాసంగా మారుతోంది

Sep 29 2016 1:53 AM | Updated on Sep 4 2017 3:24 PM

ప్రేమ పరిహాసంగా మారుతోంది

ప్రేమ పరిహాసంగా మారుతోంది

ప్రేమ పవిత్రమైనది. అదో అనిర్వచనీయమైన అనుభవం అలాంటి మాటలు చాలా విన్నాం. అలాంటిది ప్రేమ పరిహాసంగా మారింది.

 ప్రేమ పవిత్రమైనది. అదో అనిర్వచనీయమైన అనుభవం అలాంటి మాటలు చాలా విన్నాం. అలాంటిది ప్రేమ పరిహాసంగా మారింది. అనే ఆవేదన మాటలు వినాల్సి వస్తోంది. నటి వరలక్ష్మి సరిగ్గా ఇలాంటి అపనమ్మకపు వ్యాఖ్యలనే చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ బ్యూటీ నటుడు శరత్‌కుమార్ కూతురన్న విషయం తెలిసిందే. విదేశాల్లో చదువుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ మంచి డ్యాన్సర్. ముఖ్యంగా కల్సా నృత్యంలో ప్రావీణ్యం సంపాదించారు. పోడాపోడీఆ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ ఆ మధ్య విడుదలైన తారాతప్పట్టై చిత్రంతో మంచి ప్రాచుర్యం పొందారు. నటుడు విశాల్‌తో చెట్టాపట్టాలంటూ మరింతగా వార్తల్లో నిలిచారు.
 
 విశాల్, వరలక్ష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే  పెళ్లి చేసుకుంటారనే ప్రచారం చాలా కాలంగానే హల్‌చల్ చేస్తోంది. విశాల్ కూడా వచ్చే ఏడాది తన పెళ్లి ఉంటుందని వెల్లడించారు. అయితే ఎవరిని చేసుకుంటారో స్పష్టం చేయలేదు. ఇలాంటి పరిస్థితిలో నటి వరలక్ష్మి ఇటీవల ప్రేమ పరిహాసంగా మారిపోతోందని, ఏడేళ్ల ప్రేమను చాలా తేలిగ్గా వద్దంటున్నారని అదీ తన మేనేజర్‌తో చెప్పి పంపిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అసలు ప్రేమ ఏమైపోతుందోనన్న ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే తను ఎవరిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేశారన్నది క్లారిటీ లేకపోయినా, ఆమె వ్యాఖ్యలు మాత్రం మరోసారి కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి.
 
 ఇటీవల దర్శకుడు ప్రియదర్శిన్, నటి లిజి సుమారు 14 ఏళ్లు కాపురం చేసి విడిపోయి విడాకులు పొందారు. అదే విధంగా రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య ఏడాదిగా భర్త అశ్విన్ కుమార్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి విడాకులు పొందే విషయం గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు కూడా. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యలు రకరకాల ఊహలకు దారి తీస్తున్నాయంటున్నారు సినీ వర్గాలు. ఇక వరలక్ష్మి వ్యాఖ్యల్లోని అర్థం, పరమార్థం ఏమిటో తను నోరు విప్పితే గానీ తెలియదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement