హర్రర్ చిత్రంతో రీ ఎంట్రీ | Actress Sherin to make her re-entry in Kollywood | Sakshi
Sakshi News home page

హర్రర్ చిత్రంతో రీ ఎంట్రీ

Jul 19 2014 11:18 PM | Updated on Sep 18 2019 2:56 PM

హర్రర్ చిత్రంతో రీ ఎంట్రీ - Sakshi

హర్రర్ చిత్రంతో రీ ఎంట్రీ

నటి షెరీనా కొంచెం గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో హర్రర్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. నటి షెరీనా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటి షెరీనా కొంచెం గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో హర్రర్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. నటి షెరీనా మంచి అందగత్తె అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధనుష్ సరసన తుళ్లువదో ఇళమై చిత్రంలో నటించి కుర్రకారును తన అందాలతో గిలిగింతలు పెట్టించారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా హీరోయిన్‌గా పెద్దగా పేరు సంపాదించుకోలేకపోయారు. టాలీవుడ్‌లోను డేంజర్ వంటి కొన్ని చిత్రాల్లో నటించినా షెరీనా తాజాగా తిగిల్ అనే చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హర్రర్ కథాంశంతో కూడిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని మిరాకిళ్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంతోష్ కొటంకేరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అశోక్ హీరోగా నటిస్తున్నారు.
 
  కల్కి శృతి, రావికనే, విజయ్ ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ చెన్నైలో నివసించే షెరీనా తన కాబోయే భర్తను కలుసుకోవడానికి మైసూరు బయలు దేరుతుందన్నారు. రాత్రి కావడంతో మధ్యలో కూర్గ్ అనే ప్రాంతంలోని ఒక ఎత్తయిన కొండ ప్రాంతంలోని బంగ్లాలో బస చేస్తుందని తెలిపారు. ఆ రాత్రి ఆ బంగ్లాలో ఆమె ఎదుర్కొనే సంఘటనల సమాహారమే తిగిల్ చిత్రం అని చెప్పారు. హర్రర్ కథాంశంతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం షూటింగ్‌ను చెన్నై, కూర్గ్, మైసూర్ తదితర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement