సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌... 50 కలలు

Actor Sushant Singh Rajput list of 50 dreams goes viral after death - Sakshi

బంగారంలాంటి కెరీర్, మంచి భవిష్యత్‌ ఉన్న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చాలా తొందరపడ్డాడు. 34 ఏళ్లకే జీవితాన్ని ముగించుకున్నాడు. ఏడాది క్రితం తనకు 50 కలలు ఉన్నట్లు ట్వీటర్‌ ద్వారా తెలిపాడు. ఆ 50 కలలను ఓ పేపర్‌లో ‘50 డ్రీమ్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌ అండ్‌ కౌంటింగ్‌’ అని రాసి షేర్‌ చేశాడు కూడా. ఆయనకున్న 50 కలల్లో 11 కలలు నెరవేరాయి కూడా. సుశాంత్‌ ఆత్మహత్యతో మిగిలిన కలలు మాత్రం కల్లలుగానే మిగిలిపోయాయి.. ఆయన కన్న కలల్లో ప్రధానమైనవి కొన్ని...

► విమానాన్ని నడపడం నేర్చుకోవడం ఆయన మొదటి కల
► ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం
► ఎడమ చేతితో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం
► మోర్సె కోడ్‌ నేర్చుకోవడం
► చిన్నారులు అంతరిక్షం గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడం
► ఒక టెన్నిస్‌ ఛాంపియన్‌ పాత్రలో నటించడం
► నాలుగు క్లాప్‌ పుషప్‌లు చేయడం
► ఒక వారం పాటు చంద్రుడు, అంగాకరుడు, బృహస్పతి, శని గ్రహాలను పర్యవేక్షించడం
► ఒక బ్లూ హోల్‌లో ఈత కొట్టడం 
► డబుల్‌ స్లిట్‌ ప్రయోగం చేసేందుకు ప్రయత్నించడం 
► కొన్ని వేల మొక్కలు నాటడం
► ఇంజినీరింగ్‌ చదివిన ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీని సందర్శించి స్నేహితులతో ఓ సాయంత్రం సరదాగా గడపడం  
► ఇస్రో లేదా నాసా వర్క్‌షాపులకు వంద మంది పిల్లల్ని పంపించడం.
► కైలాశ్‌ (పర్వతం)పై ధ్యానం చేయడం
► ఒక పుస్తకం రాయడం
► యూరోపియన్‌ న్యూక్లియర్‌ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్‌ఎన్‌ను సందర్శించడం
► ఆరు నెలల్లోనే సిక్స్‌ ప్యాక్స్‌ శరీరాన్ని పొందడం
► చూపులేని వారికి కోడింగ్‌ నేర్పించడం
► అడవిలో ఒక వారం రోజుల పాటు గడపడం
► వైదిక జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం
► డిస్నీలాండ్‌కి వెళ్లడం
► అమెరికాలోని లిగోని సందర్శించడం
► ఒక గుర్రాన్ని పెంచుకోవడం
► కనీసం పది రకాల నృత్యాలను నేర్చుకోవడం
► ఉచిత విద్య కోసం కృషి చేయడం. సుశాంత్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పేరిట ఆయన విద్యార్థులకు సహాయం కూడా చేసేవారు.
► అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్‌ సాయంతో పరిశీలించడం  
► మంచుతో నిండిపోయిన అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడం 
► మహిళలు స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకునేలా సహాయం చేయడం 
► వ్యవసాయం నేర్చుకోవడం
► పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించడం
► రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం
► తనకు ఇష్టమైన 50 పాటలకు గిటార్‌ నేర్చుకోవడం
► ఒక ఛాంపియన్‌తో చెస్‌ ఆడటం
► లాంబోర్గిని కారును సొంతం చేసుకోవడం
► సైమాటిక్స్‌ ప్రయోగాలు చేయడం
► భారత సైన్యంలో చేరేలా విద్యార్థులు సిద్ధమయ్యేందుకు సహాయం చేయడం
► సముద్ర అలలపై సర్ఫింగ్‌ చేయడం  
► యూరప్‌ మొత్తం రైలులో ప్రయాణించడం ఆయన చివరి కల

సుశాంత్‌ కలల్లో తీరినవి...
విమానాన్ని నడపడం నేర్చుకోవడం, ఐరన్‌ మ్యాన్‌ ట్రయథ్లాన్‌కు సిద్ధం కావడం, ఎడమ చేతితో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడటం, యూరోపియన్‌ న్యూక్లియర్‌ రీసెర్చి సంస్థ అయిన సీఈఆర్‌ఎన్‌ను సందర్శించడం, ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని సందర్శించడం, బ్లూ హోల్‌లో ఈత కొట్టడం, సెనోట్‌లో ఈదడం (సున్నపురాయి భూమి కుంగిపోవడంతో సహజంగా ఏర్పడిన నీటి కొలను), డిస్నీల్యాండ్‌కి వెళ్లడం, అండ్రొమేడా అనే పాలపుంతను ఒక శక్తివంతమైన టెలిస్కోప్‌ సాయంతో పరిశీలించడం, రెండు చేతులతో బాణాలు వేసేలా శిక్షణ పొందడం, సైమాటిక్స్‌ ప్రయోగాలు చేయడం (ప్రకంపనలకు సంబంధించి).

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top