ఆ నటుడికి జపనీయుల బర్త్‌డే విషెస్‌ | Actor Subbaraju Gets Gifts From Japanese Fans | Sakshi
Sakshi News home page

ఆ నటుడికి జపనీయుల బర్త్‌డే విషెస్‌

Feb 28 2019 2:36 PM | Updated on Feb 28 2019 2:49 PM

Actor Subbaraju Gets Gifts From Japanese Fans - Sakshi

బాహుబలి సినిమాతో ప్రపంచానికి భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పారు. ఈ సినిమా ప్రపంపవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా జపాన్‌లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలోని హీరో, విలన్‌కే గాక.. ఓ పాత్రలో నటించిన ఆర్టిస్ట్‌కు సైతం విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. తన నటనతో అందరినీ మెప్పించిన సుబ్బరాజుకు జపాన్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

నిన్న (ఫిబ్రవరి 27) సుబ్బరాజు పుట్టినరోజు. బాహుబలితో జపాన్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న సుబ్బరాజుకు.. అక్కడి అభిమానులు వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేశారు. వారంతా కేక్‌ను కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సుబ్బరాజు కార్టూన్‌ బొమ్మలతో కూడిన ఫోటోలను షేర్‌ చేశారు. అంతేకాకుండా బోలెడన్ని గిఫ్ట్‌లను సుబ్బరాజుకు పంపించారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో సుబ్బరాజు షేర్‌ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement