నాకు అఫైర్లు ఉన్నాయి.. కానీ, ఆమెతో కాదు | Actor Rajasekhar Open Up about his affairs | Sakshi
Sakshi News home page

తారా చౌదరి వ్యవహారంపై నటుడు రాజశేఖర్‌

Nov 12 2017 9:59 AM | Updated on Apr 3 2019 9:02 PM

Actor Rajasekhar Open Up about his affairs - Sakshi

సాక్షి, సినిమా : తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటుడు రాజశేఖర్‌ స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘తారాచౌదరీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె ఇంట్లో నా ఫొటో ఉండటం వల్లనే వివాదం మొదలైందని తెలిసింది. నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరీని కలిశాను. ఆ తర్వాత ఆమె అద్దెకుంటున్న పక్క పోర్షన్ జీవితతోపాటు వెళ్లినప్పుడు మరోసారి కలిశాను. అంతేతప్ప ఆమె చెప్పినట్లు నాకు-ఆమెకు దగ్గరి సంబంధాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ధైర్యంగా నేను చెబుతాను’’ అని రాజశేఖర్‌ తేల్చారు. తాను కేవలం జీవితకి మాత్రమే భయపడతానే తప్ప ఇంకెవ్వరికీ భయపడనని ఆయన చెప్పారు.

అయితే తనకు కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన.. తారా చౌదరీ విషయంలో మాత్రం రాముడినని తనను తాను అభివర్ణించుకున్నారు. ‘పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయి. జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే అవి యాక్సిండెట్‌గా జరిగినవే’’ అని రాజశేఖర్‌ చెప్పారు. ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్‌ ఛానెల్‌ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలో పై వ్యాఖ్యలు చూడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement