క్యాన్సర్‌తో యువ నటుడి మృతి

Actor Mohit Baghel Deceased Of Cancer In Mathura - Sakshi

లక్నో : బాలీవుడ్‌ యువ నటుడు మోహిత్‌ బఘేల్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోహిత్‌.. తన స్వస్థలం మథురలో శనివారం తుదిశ్వాస విడిచారు. మోహిత్‌ మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పించారు. మోహిత్‌ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రముఖ రచయిత రాజ్ శాండిల్య అన్నారు. ‘గొప్ప సహానటుడిని కోల్పోయాం. లవ్‌ యూ మోహిత్‌.. ఆర్‌ఐపీ’ అని నటి పరిణితీ చోప్రా పేర్కొన్నారు.(చదవండి : బాలీవుడ్‌ను వదలని కరోనా..)

గత ఆరు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మోహిత్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అతని సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం మోహిత తన తల్లిదండ్రులు, అన్నతో కలిసి మథురలో నివస్తున్నట్టు వెల్లడించారు. అయితే శనివారం అతను మరణించినట్టు చెప్పారు. కాగా, రియాలిటీ షో చోటే మియాన్‌తో మోహిత్‌ తన కేరీర్‌ను ప్రారంభించారు. 2011లో విడుదలైన సల్మాన్‌ ఖాన్‌ రెడీ చిత్రంలో అమర్‌ చౌదరి పాత్రలో నటించిన మోహిత్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్దార్థ్‌ మల్హోత్రా, పరిణితీ చోప్రా జంటగా నటించిన జబారియా జోడి చిత్రంలో కూడా మోహిత్‌ నటించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top