‘గాయత్రి’ పైరసీపై మోహన్‌ బాబు ఆగ్రహం

actor Mohan babu reaction for gayatri movie piracy  - Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా మంచు విష్ణు, శ్రియ నటించిన ఈ చిత్రానికి మదన్‌ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top