మైక్‌ టెస్టింగ్‌ 123

Actor Jai debuts as a singer in 'Jarugandi' - Sakshi

‘అనుకున్నది చేసెయ్‌. మొదలు పెట్టింది పూర్తిగా ముగించెయ్‌....’ అంటున్నారు తమిళ నటుడు జై. ఇప్పుడెందుకీ స్ఫూర్తి గీతం అంటే ‘జరుగండి’ అనే లేటెస్ట్‌ తమిళ సినిమా కోసం. ‘జర్నీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ నటుడు జై. ఆ తర్వాత ‘రాజా రాణీ’ సినిమాలో కూడా మంచి పాత్ర చేశారు. యాక్టర్‌గా తమిళంలో మంచి స్పీడ్‌ మీద ఉన్న ఈ హీరో సింగర్‌గా కొత్త అవతారం ఎత్తారు. మైక్‌ పట్టుకొని మైక్‌ టెస్టింగ్‌ 123 అన్నారు. అనడమేంటి పాట కూడా పాడేశారు. ‘జరుగండి’ అనే సినిమాలో ‘సెయిరద సెంజు ముడి’ (అంటే.. చేసేది పూర్తిగా చెయ్‌) అనే పాట పాడారు. ఈ పాటకు బోబో శశి స్వరకర్త.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top