ప్రేమలో అర్జున్‌రెడ్డి యాక్టర్‌..!

actor introduces his Fiancee on Twitter - Sakshi

ఫియాన్సీని సోషల్‌ మీడియాలో పరిచయం చేసిన ప్రియదర్శి

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ ప్రేమలో మునిగితేలుతున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్‌ చేశాడు. తన ప్రేమికురాలు రిచా శర్మను ప్రపంచానికి పరిచయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల లేదా వచ్చేనెలలో ప్రియదర్శి-రిచా శర్మ పెళ్లి చేసుకోబోతున్నారని, దీని గురించి త్వరలోనే అధికారిక సమాచారం వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు.

‘ఆమె గురించి నా భావాలు, భావోద్వేగాలు పదాల్లో రాయాలని ప్రయత్నించి.. విఫలమయ్యాను. ఆమె అందమైన మనస్సును వర్ణించాలంటే ఎన్నో లక్షల కవితలు రాయాల్సి ఉంటుంది.. నన్ను పూర్తిగా అర్థం చేసుకొని.. నా జీవితంలో తను అడుగుపెట్టబోతుందంటూ’ ఓ అందమైన సందేశంతో ప్రియదర్శి తన ప్రేమికురాలు రిచాశర్మకు వాలెంటైన్స్‌ డే విషెస్‌ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది.

విజయ్‌ దేవరకొండ, నీతూ వర్మ జంటగా తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’  సినిమా ద్వారా కమేడియన్‌గా పరిచయమైన ప్రియదర్శి అనతికాలంలో పాపులర్‌ అయ్యాడు. ఈ సినిమాలో కౌషిక్‌గా నటించిన ప్రియదర్శి చెప్పిన డైలాగ్‌ ‘నా చావు నే చస్తా.. నీకెందుకు’ బాగా  ఫేమస్‌ అయింది. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి సినిమాలోనూ లాయర్‌గా ప్రియదర్శి కీలక పాత్ర పోషించాడు. బాబు బాగా బిజీ, జైలవకుశ, ఉన్నది ఒక్కటే జిందగి, ఎంసీఏ తదితర సినిమాల్లో నటించాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top