నమస్కార్‌.. బాబ్‌ బిస్వాస్‌ మొదలైంది

Abhishek Bachchan, Chitrangada Singh begin shoot of Bob Biswas - Sakshi

ఎనిమిదేళ్ల క్రితం సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం ‘కహానీ’. ఈ సినిమాలో సస్వతా చటర్జీ చేసిన ‘బాబ్‌ బిస్వాస్‌’ అనే కాంట్రాక్ట్‌ కిల్లర్‌ పాత్ర హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ పాత్ర పేరుతో హిందీలో తెరకెక్కుతోన్న సినిమాలో అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దియా ఎ. ఘోష్‌ దర్శకురాలు. చిత్రాంగదా సింగ్‌ కథానాయికగా నటిస్తారట. షారుక్‌ ఖాన్, గౌరీ ఖాన్‌ (షారుక్‌ ఖాన్‌ భార్య), సుజోయ్‌ ఘోష్,  గౌరవ్‌ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా చిత్రీకరణ కోల్‌కతాలో మొదలైంది. ‘‘లైట్స్‌... కెమెరా.. నమస్కార్‌.. ‘బాబ్‌ బిస్వాస్‌’ షూటింగ్‌లో తొలి రోజు పాల్గొన్నాను’’ అన్నారు అభిషేక్‌ బచ్చన్‌. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top