జీవితం కోసం ఆట | Aatagallu movie releasing on August 24th | Sakshi
Sakshi News home page

జీవితం కోసం ఆట

Aug 4 2018 1:22 AM | Updated on Aug 4 2018 1:22 AM

Aatagallu movie releasing on August 24th - Sakshi

దర్శనా బానిక్, నారా రోహిత్‌

‘నీ స్నేహం, ఆంధ్రుడు’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఆటగాళ్ళు’. ‘గేమ్‌ ఫర్‌ లైఫ్‌’ అన్నది ఉపశీర్షిక. నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా నటించారు. దర్శనా బానిక్‌ ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ పతాకంపై వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇంటెలిజెంట్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. కథ వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబుపై వచ్చే ప్రతి సీన్‌ ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందంగారు తనదైన శైలిలో నవ్విస్తారు. సాయికార్తీక్‌ సంగీతం, విజయ్‌ సి.కుమార్‌ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి  మరో హైలైట్‌. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement