రాజకీయ నేపథ్యంలో... | aagraham movie shooting completed | Sakshi
Sakshi News home page

రాజకీయ నేపథ్యంలో...

Mar 22 2019 12:45 AM | Updated on Mar 22 2019 12:45 AM

aagraham movie shooting completed - Sakshi

సుస్మిత, సుదీప్‌

సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్‌.ఎస్‌. సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘ఆగ్రహం’. ఎస్‌ఎస్‌ చెరుకూరి క్రియేషన్స్‌ పతాకంపై సందీప్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్‌ జరుపుకుంటోంది. ఆర్‌.ఎస్‌.సురేష్‌ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే కథాంశమిది. ‘ఆఫీసర్, సర్కార్‌ 3’ చిత్రాలకు సంగీతం అందించిన రవిశంకర్‌ ఆర్‌.ఆర్‌ స్వరాలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణ. యాక్షన్‌ సన్నివేశాలు మరో హైలైట్‌’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌  అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెరకెక్కించాం. ఏప్రిల్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్‌ చెరుకూరి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌. రామకృష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement