అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల

అమెరికాలో 159 స్క్రీన్లలో 'ఆగడు' విడుదల


సూపర్స్టార్ మహేశ్బాబు నటించిన 'ఆగడు' చిత్రం విడుదల విషయంలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క అమెరికాలోనే ఏకంగా 159 స్క్రీన్లలో దీన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర చెప్పారు. అమెరికాలో ఇంత విస్తృత స్థాయిలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదని, తమ పంపిణీ భాగస్వామి ఇరోస్ ఇంటర్నేషనల్కు ఇందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఆయన అన్నారు. ఉత్తర భారతదేశంలో కూడా తాము వందకుపైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నామన్నారు.ఉత్తర భారతదేశంలో ఒక తెలుగుసినిమాకు ఇన్ని స్క్రీన్లు సాధించడం అంత సులభం కాదని, ఇరోస్ కారణంగానే ఇది కూడా సాధ్యమయ్యిందని ఆయన చెప్పారు. మహేశ్ బాబుతో శ్రీనువైట్ల తీసిన రెండో చిత్రం అయిన 'ఆగడు'లో మిల్కీబ్యూటీ తమన్నా ఆయన సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రుతిహాసన్, సోనూ సూద్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా భారీ విజయం సాధించడం ఖాయమని అనిల్ సుంకర ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే ఉంటుందన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top