ఏట్టి రీమేక్లో ఆది..? | Aadi To Do Eetti Telugu Remake | Sakshi
Sakshi News home page

ఏట్టి రీమేక్లో ఆది..?

Aug 25 2016 12:58 PM | Updated on Sep 4 2017 10:52 AM

ఏట్టి రీమేక్లో ఆది..?

ఏట్టి రీమేక్లో ఆది..?

చుట్టాలబ్బాయి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో ఆది, తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్...

చుట్టాలబ్బాయి సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన యంగ్ హీరో ఆది, తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న క్యారెక్టర్లలో మాత్రమే కనిపించిన ఆది, భవిష్యత్తులో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

స్కూల్ డేస్ నుంచి మంచి రన్నర్గా పేరున్న ఆది తమిళ్లో ఘన విజయం సాధించిన ఏట్టి సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఓ వింత వ్యాదితో బాదపడుతున్న క్రీడాకారుడి కథగా తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా నాగశౌర్యతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఆది స్టేట్ మెంట్తో ఏమైనా మార్పులు జరుగుతాయేమో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement