2.0 @ 29.11.18 | 2.0 release date announced | Sakshi
Sakshi News home page

2.0 @ 29.11.18

Jul 12 2018 12:46 AM | Updated on Sep 12 2019 10:40 AM

 2.0 release date announced - Sakshi

రజనీకాంత్, అమీ జాక్సన్‌

ఎప్పటినుంచో సినీ ప్రేమికులు ఎదురుచూస్తోన్న సినిమాల్లో ‘2.0’ చిత్రం ఒకటి. ఇప్పటికే చాలా సార్లు ఈ సినిమా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్రబృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటింటించింది. రజనీకాంత్, అక్షయ్‌ కుమార్, అమీజాక్సన్‌ ముఖ్య తారలుగా శంకర్‌ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన సినిమా ‘2.0’. 2010లో శంకర్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘యందిరిన్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఈ సినిమాను ముందుగా గత ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. కుదరకపోవడంతో ఈ ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలచేయాలనుకున్నప్పటికీ వీలుపడలేదు.

అలాగే ఈ ఏడాది వేసవిలో రిలీజ్‌ చేయనున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పెండింగ్‌ ఉండటం వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ‘2.0’ చిత్రబృందం సినిమాను ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. ‘‘అందరికీ హాయ్‌. చివరిగా మూవీ ఫైనల్‌ కాపీని ఇవ్వడానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ డీల్‌ చేస్తోన్న కంపెనీలు ఓ డెలివరీ డేట్‌ను చెప్పారు. సినిమాను ఈ ఏడాది నవంబర్‌ 29న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు డైరెక్టర్‌ శంకర్‌. ఈసారైనా  చెప్పిన తేదీకి సినిమా రావాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement