మరింత ఆలస్యం కానున్న‘2.o’ | 2 Point o MOvie Will Be More Delay Due To VFX Works | Sakshi
Sakshi News home page

May 3 2018 6:06 PM | Updated on May 3 2018 6:06 PM

2 Point o MOvie Will Be More Delay Due To VFX Works - Sakshi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఇండియన్‌ గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న 2.o సినిమా మరింత ఆలస్యం కానుందని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌, హై క్యాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తైయింది. కానీ సినిమాకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌ పనులు మాత్రం ఆలస్యంగా జరుగుతున్నాయి. హై టెక్నీషియన్స్‌తో అమెరికాలో జరుగుతున్న ఈ గ్రాఫిక్స్‌ పనుల వల్లే సినిమా విడుదల ఆలస్యం అవుతోంది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఇంకా మొదలు పెట్టలేదని తెలుస్తోంది. 

ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కనీసం చిత్ర యూనిట్‌కు కూడా తెలియడం లేదు. లైకా ప్రొడక్షన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా 2.o ను తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్‌ శంకర్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా... వీఎఫ్‌ఎక్స్‌ పనులను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించగా, అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రజనీ ‘కాలా’ విడుదలకు రెడీ అవ్వగా, యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌తో మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement