నిజమైన ప్రేమకథ | "2 friends" movie shooting start at hyderabad. | Sakshi
Sakshi News home page

నిజమైన ప్రేమకథ

Jun 10 2017 12:18 AM | Updated on Sep 5 2017 1:12 PM

నిజమైన ప్రేమకథ

నిజమైన ప్రేమకథ

సూరజ్, రవీంద్రతేజ, సానియా, ఫారా ముఖ్యతారలు గా జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2 ఫ్రెండ్స్‌’ శుక్రవారం ప్రారంభమైంది.

సూరజ్, రవీంద్రతేజ, సానియా, ఫారా ముఖ్యతారలు గా జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘2 ఫ్రెండ్స్‌’ శుక్రవారం ప్రారంభమైంది. ట్రూ లవ్‌ స్టోరి అనేది ఉపశీర్షిక. ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్నారు.

తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే గాంధీ క్లాప్‌ ఇవ్వగా, నటుడు విజయ్‌చందర్‌ స్విచ్చాన్‌ చేశారు. ఓంప్రకాశ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కథ తయారు చేయడానికి ఏడాది పట్టింది. పాటల రికార్డింగ్‌ పూర్తయింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సంబంధించిన మంచి కథ ఇది’’ అన్నారు జీఎల్‌బీ శ్రీనివాస్‌. ‘‘ప్రేమ, స్నేహం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంటుంది’’ అన్నారు నిర్మాత అనంతరాముడు. సంగీతం: పోలూర్‌ ఘటికాచలం.

Advertisement
 
Advertisement
Advertisement