రేస్‌ 3 పోస్టర్‌ లాంఛ్‌ |  Race 3 New Poster Released | Sakshi
Sakshi News home page

రేస్‌ 3 పోస్టర్‌ లాంఛ్‌

Apr 27 2018 8:21 PM | Updated on Apr 27 2018 8:21 PM

 Race 3 New Poster Released - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ రేస్‌ 3 షూటింగ్‌లో జమ్మూ కశ్మీర్‌లో బిజీబిజీగా గడుపుతున్న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఈ మూవీకి సంబంధించిన తాజా పోస్టర్‌ను తన ట్విటర్‌లో విడుదల చేశారు. హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో గన్‌ పట్టుకుని ఉన్న సల్మాన్‌ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటను యూనిట్‌ తెరకెక్కిస్తోంది. రేస్‌ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు విడుదలైన మూవీల్లో సైఫ్‌ అలీఖాన్‌ హీరోగా నటించారు.

ఇక రేస్‌ 3లో బాలీవుడ్‌ కండలవీరుడు ఎలా ఒదిగిపోతారన్నది ఆసక్తికరంగా మారింది. సల్మాన్‌, జాక్వెలిన్‌తో పాటు అనిల్‌ కపూర్‌, డైసీ షా, బాబీ డియోల్‌, దరువలా, అమిత్‌ సాధ్‌లు ఇతర తారాగణం. రేస్‌ 3లో ఓ పాటలో సోనాక్షి సిన్హా కూడా కొద్దిసేపు మెరిసినట్టు భావిస్తున్నారు. టిప్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందిన రేస్‌ 3 జూన్‌ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement
 
Advertisement
Advertisement