10 బెస్ట్‌ డేటింగ్‌ యాప్స్‌, సైట్లు

Top 10 Dating Apps For Online Love - Sakshi

‘స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లు’ అన్న మాట అక్షర సత్యం. విజ్ఞానం, వినోదం.. ఒకటేంటి అన్ని విధాలా ఫోన్‌ మనిషికి ఓ అత్యవసరంగా మారిపోయింది. చిత్రంగా స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని దగ్గరగా ఉన్న వాళ్లు దూరం అవుతుంటే సోషల్‌ మీడియా పుణ్యమా అని పరిచయం లేని వాళ్లతో కొత్త స్నేహాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని అవసరాలతో పాటు ప్రేమ ​కోసం కూడా కొన్ని యాప్‌లు, సైట్లు పుట్టుకొచ్చాయి. అవే డేటింగ్‌ యాప్స్‌, సైట్లు! ఈ  డేటింగ్‌ సైట్స్‌, యాప్స్‌ల సంస్కృతి ఇప్పుడిప్పుడే మన దేశంలో వేళ్లూనుకుపోతోంది. ఇంట్లో కూర్చుని సరుకులు ఆర్డర్‌ చేసినట్లు ఆన్‌లైన్‌లో మనకు నచ్చిన వ్యక్తితో ప్రేమలో పడొచ్చు. 

వీటి ద్వారా కొన్ని వేల మందిని జల్లెడ పట్టి మనకు నచ్చిన భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది.అలాగే ఎలాంటి వారు కావాలలో(అభిరుచులు, అభిప్రాయాలు..) ఎంచుకోవచచ్చు. మ్యాచింగ్‌ టెస్ట్‌ ద్వారా మనకు ఎలాంటి భాగస్వామి అయితే బాగుంటారో కూడా తెలుసుకోవచ్చు. మనం వారిని కలుసుకునే ముందుగా వారిని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు, పరిచయం పెంచుకోవచ్చు. నచ్చితే మన రిలేషన్‌ను ముందుకు నడిపించొచ్చు.

ప్రేమ కోసం అన్వేషించే సోషల్‌ మీడియా లవర్స్‌ కోసం పది డేటింగ్‌ సైట్లు, యాప్స్‌ : 

1)  OKCupid.com
2)  Tastebuds.fm
3)  HowAboutWe.com
4)  MySingleFriend.com
5) eHarmony.com
యాప్స్‌
6) Tinder
7) Bumble
8) Hinge
9) Happn
10) Wingman
(డేటింగ్‌ యాప్స్‌ లేదా సైట్లు వాడాలనుకునే వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిదేంటంటే.. వీటి పనితీరుపై యువతనుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అలాగే వీటి వాడకంతో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా ఉంటాయని గుర్తించాలి.)

చదవండి : డేటింగ్‌ యాప్‌.. బాప్‌రే బాప్


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top