తనను లైఫ్‌ లాంగ్‌ ప్రేమిస్తా

Azhar Sad Ending Telugu Love Story - Sakshi

ఓ రాంగ్‌ కాల్‌ ద్వారా తను నాకు పరిచయం అయ్యింది. వాట్సాప్‌లో తొమ్మిది రోజులు చాట్‌ చేసుకున్నాం. ఫ్రెండ్స్‌ కూడాఅయ్యాం. పదవ రోజు ఆ అమ్మాయి ఫోన్‌ పోయింది. నేను కాల్‌ చేస్తుంటే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. ఆ అమ్మాయి అడ్రస్‌ తెలీదు. కాలేజ్‌ తెలీదు. ఫొటో కూడా చూడలేదు. అలానే ఒక నెల పాటు కాల్‌ చేశా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. తర్వాత నేను కాల్‌ చేయటం మానేశా. తర్వాత మా ఫ్రెండ్‌  ‘ఫేస్‌బుక్‌లో నెంబర్‌తో ట్రై చేయ్‌’ అని చెప్పాడు. ఎనిమిది నెలల తర్వాత ఫేస్‌బుక్‌లో తన నెంబర్‌ టైప్‌ చేసి సెర్చ్‌ చేశా. ఏదో అబ్బాయి ఫ్రోఫైల్‌ ఓపెన్‌ అయ్యింది. అబ్బాయి ఫ్రెండ్‌ లిస్ట్‌లో తన పేరు సెర్చ్‌ చేశా! తన ఫ్రోఫైల్‌ దొరికింది. డైరెక్ట్‌ మెసేజ్‌ చేశా. ఎనిమిది నిమిషాల తర్వాత రిప్లై వచ్చింది. ‘కొన్ని నెలల క్రితం ఇద్దరం చాట్‌ చేసుకున్నాం’ అని ఆమెకు గుర్తుచేశా. తన పేరు చెప్పి నువ్వేకదా అని అడిగా. ‘అవును పిచ్చోడా! నా మొబైల్‌ పోయింది. నీ మెసేజ్‌ కోసం చాలా ఎదురు చూస్తున్నా. నీ నెంబర్‌ తెలీదు కానీ, మనం మళ్లీ కలుసుకుంటామని నాకు నమ్మకం ఉంది. అలా డైలీ చాటింగ్‌, కాల్స్‌ చేసుకునేవాళ్లం.

రెండు నెలల తర్వాత తనకి ప్రపోజ్‌ చేశా. 23 రోజుల తర్వాత ఓకే చెప్పింది. అలా రెండేళ్లు మా మధ్య ప్రేమ హాయిగా నడిచింది. ప్రతిరోజూ ఆనందమే. గొడవలు అవుతుండేవి కానీ, వెంటనే కాంప్రమైజ్‌ అయ్యేవాళ్లం. లేవగానే మాట్లాడుకునేవాళ్లం. ఎప్పుడు పడుకుంటామో తెలీదు. అప్పుడే నాకు కోడలు పుట్టింది. కోడలి ఫంక్షన్‌లో మా విషయం ఇంట్లో చెప్పేస్తా అన్నా. మా ఇంట్లో అందరికి తెలుసు. కానీ, మా నాన్నకు తెలీదు. ఫంక్షన్‌లో చెబుదాం అనుకున్నా. ఆ అమ్మాయి మా విషయం వాళ్ల అమ్మతో చెప్పింది. దీంతో వాళ్లు చస్తామని బెదిరించారు. వెంటనే పెళ్లి చూపులు పెట్టారు. నేను వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లా.. వాళ్లు ఒప్పుకోలేదు. ఆర్థికంగా మేము బాగా ఉన్నాం. తనకు వచ్చిన సంబంధం ఆస్ట్రేలియానుంచి అందుకే నన్ను రిజెక్ట్‌ చేశారు.

పెళ్లి అయిపోయింది. నేను పిచ్చోడిని అయిపోయా. డైలీ డ్రింక్‌ అండ్‌ స్మోక్‌ అలా నాలుగు నెలలు గడిపేశా. తర్వాత ఓ రోజు తనని ఓ బైక్‌పై చూశా. తను చాలా సంతోషంగా ఉంది. నేను అప్పుడు డిసైడ్‌ అయ్యా. నన్ను నేను మార్చుకోవాలని. గతంలో నేను ఆర్మీలో చేరాలని అనుకున్నాను. కానీ, తనకోసం నా ఆశయాన్ని మార్చుకున్నా. మళ్లీ ఆర్మీ ఈవెంట్స్‌కు హాజరై క్వాలిఫై అయ్యా. తనకు ఆ విషయం తెలిసి నాకు ఫోన్‌ చేసింది. వెళ్లొద్దని ఏడ్చింది. ప్రైవేట్‌ జాబ్‌ చేసుకోమంది. తన మాట కాదనలేకపోయా. ప్రస్తుతం ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నా. అమ్మాయి ప్రేమ శాశ్వతం కాదు. తన సంతోషమే మన సంతోషం అనుకోవాలి. తనను లైఫ్‌ లాంగ్‌ ప్రేమిస్తా. ట్రూ లవ్‌ నెవర్‌ ఎండ్స్‌. 
- అజర్‌


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

14-12-2019
Dec 14, 2019, 11:44 IST
సినిమా : రెమో  తారాగణం : శివ కార్తికేయన్‌, కీర్తి సురేష్‌, శరణ్య, సతీష్‌, కేఎస్‌ రవికుమార్‌, యోగి బాబు, రాజేంద్రన్‌ కథ...
14-12-2019
Dec 14, 2019, 10:25 IST
నేను స్కూల్లో చదువుతున్నపుడు చాలా మంది నాకు ప్రపోజ్‌ చేశారు. కానీ, ఆ వయసులో ఆకర్షణలు మామూలే అనుకుని వాళ్లతో...
13-12-2019
Dec 13, 2019, 16:31 IST
మాది పులివెందుల దగ్గర పల్లె. నాకు నా మరదలంటే చిన్నప్పటి నుండి ఇష్టం. ఎంతలా అంటే ఆ అమ్మాయి స్కూల్‌కు...
13-12-2019
Dec 13, 2019, 15:00 IST
మాది కరీంనగర్‌ జిల్లా. నా చిన్నప్పటి క్లాస్‌మేట్‌ పేరు వినీత. తనంటే నాకు చాలా ఇష్టం. తను మా ఇంటి...
13-12-2019
Dec 13, 2019, 11:44 IST
 మేషం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో చేసే...
13-12-2019
Dec 13, 2019, 10:32 IST
బహుశా అది ఆగస్టు 15 అనుకుంటా! మా స్కూల్లో జెండా వందన కార్యక్రమం అవ్వగానే మా ఫ్రెండ్ నాతో ‘మా...
12-12-2019
Dec 12, 2019, 16:31 IST
నా పాఠశాల చివరి రోజులవి.. పాఠశాలతో బంధం తెగిపోతుందనుకున్నా. కానీ, నా జీవితంలో కొత్త బంధం మొదలైంది. మంచి నీళ్ల...
12-12-2019
Dec 12, 2019, 15:11 IST
తను నా మాట వినలేదు. రోజుకు ఒకరకంగా టార్చర్‌ చేసింది...
12-12-2019
Dec 12, 2019, 12:04 IST
మనం రిలేషన్‌లో ఉన్నపుడు చాలా విషయాల్లో భాగస్వామి మిగితా వాళ్లకంటే ప్రత్యేకంగా అనిపిస్తారు. నిజం చెప్పాలంటే అది వాస్తవం కూడా!...
12-12-2019
Dec 12, 2019, 10:31 IST
నేను ఇంటర్‌ చదివేటప్పుడు ఒక అమ్మాయి నన్ను ఫిజిక్స్‌లో డౌట్‌ అడిగింది. నేను ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేశాను. అప్పుడు ప్రేమ అంటే...
11-12-2019
Dec 11, 2019, 16:41 IST
జాబ్ చేయాలి, తనని పెళ్లి చేసుకోవాలి. తన చదువు....
11-12-2019
Dec 11, 2019, 15:09 IST
ఎడారిలాంటి నా జీవితంలోకి ఓ అలలా చొచ్చుకు వచ్చిన నా దేవత విశిత. మా పరిచయం చాలా విచిత్రంగా జరిగింది!...
11-12-2019
Dec 11, 2019, 12:01 IST
అదృష్టం అడ్డం తిరిగినపుడు అరటిపండు తిన్నా పండు ఊడుద్ది అన్నట్లు...
11-12-2019
Dec 11, 2019, 10:25 IST
ప్రేమించిన వాళ్ల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఒక్క క్షణం చాలు. ఆ ఒక్క క్షణంలో వాళ్ల ప్రేమ ఎంత గొప్పదో మనకి...
09-12-2019
Dec 09, 2019, 16:18 IST
కానీ, క్రిమినల్‌ మైండ్‌సెట్‌ ఎప్పటికీ మారదని...
09-12-2019
Dec 09, 2019, 15:01 IST
నేను నా చిన్నప్పటినుంచి అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, ఒక రోజు నాకు తెలియకుండా మా అమ్మానాన్న నా...
09-12-2019
Dec 09, 2019, 11:44 IST
ఇష్టపడ్డవారితో బ్రేకప్‌ చేసుకోవటం మాటల్లో చెప్పినంత తేలికైన పనికాదు. అదీ ముఖ్యంగా కాలేజీ రోజుల్లో అయితే మరీ కష్టం. బ్రేకప్‌...
09-12-2019
Dec 09, 2019, 10:15 IST
అమ్మాయిలతో డైరెక్ట్‌గా మాట్లాడే ధైర్యం లేక ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకోవాలనే చిన్న ఆశతో ఎఫ్‌బీకి దగ్గరయ్యాను. అలా ప్రేయసి కోసం...
08-12-2019
Dec 08, 2019, 16:45 IST
జూలై 6 రాత్రి 11 అవుతోంది. నేను ఆఫీస్ వర్క్ కొంచెం ఎక్కువగా వుందని ఇంట్లోనుంచి పని చేస్తున్నాను. పని...
08-12-2019
Dec 08, 2019, 15:28 IST
నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యింది. నేను డిగ్రీ పూర్తి అయ్యేసరికి నాకు ఆ ఫ్యామిలీకి,...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top