గిరిజన యువకుడిపై దాష్టీకం.. వైరల్ | Srisailam temple cso attacks tribal youth video goes viral | Sakshi
Sakshi News home page

గిరిజన యువకుడిపై దాష్టీకం.. వైరల్

Jan 8 2018 10:37 PM | Updated on Jan 9 2018 12:56 PM

Srisailam temple cso attacks tribal youth video goes viral - Sakshi

సాక్షి, శ్రీశైలం: చెంచు గిరిజన యువకుడిపై ఓ ప్రసిద్ధ దేవస్థానానికి చెందిన ఓ ఉన్నతాధికారి దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ సీఎస్‌వోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ గిరిజన యువకుడు శ్రీశైలం దేవస్థానంలో అభిషేకం చెంబులు శుభ్రపరిచేవాడు.

ఈ క్రమంలో బాధిత గిరిజన యువకుడు అక్కడ చిల్లర డబ్బులు ఏరుకున్నట్లు దేవస్థానం సీఎస్‌ఓ దృష్టికొచ్చింది. తీవ్ర ఆవేశంతో ఆ గిరిజన యువకుడిని బూతులు తిడుతూ సీఎస్‌ఓ చితకబాదారు. దేవస్థానం సీసీ కెమెరాల నిఘా విభాగం గదిలో గిరిజనుడిని కొట్టిన వ్యవహారం వీడియోలు లీక్ కావడంతో విషయం వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement