
మల్లన్న ఉచిత స్పర్శదర్శనానికి ని‘బంధనాలు’
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పునఃప్రారంభించిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి దేవస్థానం రోజుకో నిబంధన పెడుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తు తప్పనిసరి చేయడంతో పాటు నెలలో ఒకసారి మాత్రమేనంటూ దేవస్థానం వెబ్‌సైట్‌లో భక్తుల ఆధార్ లాక్ పెట్టడం గమనార్హం.
ఏ క్షేత్రంలో లేని విధంగా శ్రీశైల మహాక్షేత్రంలో పరమశివుడైన మల్లికార్జున స్వామివారిని భక్తులు స్వయంగా తాకి (స్పర్శ) దర్శనం చేసుకోవచ్చు. పరమేశ్వరుడు అభిషిక ప్రియుడు. అభిషిక ప్రియుడికి ఆయనపై కొన్ని స్వచ్ఛమైన నీటిని పోసి, మారేడుదళం, బిల్వదళంతో అర్చిస్తే..సంబరపడి పోయి కోరిన కోర్కెలు తీర్చుతారని భక్తుల నమ్మకం. కాగా సామాన్య భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ నెల 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని పునఃప్రారంభించారు.
శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో జవాబుదారీతనం, పారదర్శకతకోసం కొత్తగా టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏ రోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేశారు. కంప్యూటరైజ్డ్ టోకెన్లలో భక్తుని పేరు, ఆధార్, ఫోన్ నెంబర్‌ను నమోదు చేసి టోకెన్లను ఇచ్చారు. ఈ టోకెన్లను ఉచిత దర్శనం క్యూలైన్ ప్రవేశద్వారం వద్దనున్న స్కానింగ్ ద్వారా తనిఖీ చేసి భక్తులను ఉచిత స్పర్శదర్శనానికి అనుమతించారు. రోజుకు 1000 నుంచి 1200 టోకెన్లను జారీ చేశారు. అలాగే స్పర్శదర్శనానికి పురుషులు తెల్ల పంచె, మెడలో తెల్లకండువా.. మహిళలు చీర, రవిక, చున్నీతో కూడిన సల్వార్ కమీజ్‌లను ధరించాల్సి ఉంటుంది.
ఆర్జితసేవా టికెట్ల రుసుం.. ప్రియం
జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారి గర్భాలయంలో అభిõÙకం చేయాలంటే రూ.5 వేలు సమరి్పంచాల్సిందే. సామాన్యులు అంత పెద్ద మొత్తం వెచ్చించి అభిõÙకం చేయించుకోలేని పరిస్థితి. సామూహిక అభిõÙకం (రూ.1,500)సేవ ఉంది. ఈ సేవలో ప్రత్యేక మండపంలో భక్తులందరినీ సామూహికంగా కూర్చోపెట్టి అభిõÙకాది పూజలు నిర్వహించిన అనంతరం కలశంలో నీటిని తీసుకుని స్వామివారి మీద పోసి దర్శించుకుంటారు. అయితే గర్భాలయంలో స్వామి చెంత అభిõÙకం చేయలేదనే అసంతృప్తి భక్తుల్లో నెలకొంటుంది. అలాగే మల్లన్న స్పర్శదర్శనం చేసుకునేందుకు భక్తులు (ఒక్కొక్కరికి) దేవస్థానానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది సామాన్య భక్తులు మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోలేక పోతున్నారు. భార్య, భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న చిన్నపాటి కుటుంబం మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవాలన్నా రూ.2,500 చెల్లించాలి. చాలా మందికి మల్లన్నను స్పర్శదర్శనం చేసుకోవాలని కుతూహలం ఉన్నప్పటికీ అరి్థక స్థోమత లేక చాలా మంది దూర (దూళి) దర్శనం చేసుకుంటున్నారు.
కుంకుమార్చన రూ.1000
అష్టాదశ శక్తిపీఠమైన భ్రమరాంబాదేవి ఆలయంలో అమ్మవారి గర్భాలయం ఎదురుగా శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేయాలంటే రూ.1000 చెల్లించాల్సిందే. అంతేకాకుండా భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను (దూళి) దర్శించుకోవాలంటే రూ.150 సేవా రుసుంతో శీఘ్ర దర్శనం, రూ.300 టికెట్లు ధరతో అతిశీఘ్ర దర్శనం పేరుతో దేవస్థానం ఏర్పాటు చేశారు. అలాగే ఉభయ దేవాలయాల్లో అంతేకాకుండా స్వామిమఅమ్మవార్ల కల్యాణం, రుద్రహోమం, చండీహోమం, ఇలా ఏ ఆర్జిత సేవ అయినా రూ.1000 ఆ పైనే ఉంటుంది. ఇప్పటికైన దేవస్థాన అధికారులు స్వామి వారి దర్శనం సామాన్యులకు లభించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నెలలో ఒకసారి మాత్రమే..?
దేవస్థానం కలి్పస్తున్న ఉచిత స్పర్శదర్శనం భక్తులు నెలలో ఒకసారి మాత్రమే నిర్వహించుకునేలా దేవస్థానం వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తున్నారు. ఒక భక్తుడు తన ఆధార్‌కార్డుపై ఒక రోజు ఉచిత మల్లన్న స్పర్శదర్శనం టికెట్టు బుక్ చేసుకుంటే అతని ఆధార్ కార్డును నెల రోజుల పాటు దేవస్థానం వెబ్‌సైట్‌లో లాక్ పెడతారు. నెల తరువాతనే అతని ఆధార్‌కార్డుపై ఉచిత స్పర్శదర్శనం టికెట్టు బుక్ అవుతుంది.
ఉచిత స్పర్శదర్శనానికి ఆన్‌లైన్‌లో..
శ్రీశైల దేవస్థానం పునఃప్రారంభించిన మల్లన్న ఉచిత స్పర్శదర్శనానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని దేవస్థానం కొత్త నిబంధన పెట్టింది. శ్రీశైల దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా ఇతర ఆర్జిత సేవా టికెట్లు పొందేవిధంగా ఉచిత స్పర్శదర్శనానికి సైతం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టారు. దర్శనానికి ఒకరోజు ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్టు బుక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న కాపీని, ఆధార్ జిరాక్స్‌ను తీసుకొస్తేనే ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తున్నారు.