అయ్యో సార్లూ.. ఇదేం తీరు.. | republic day celebrations in sircilla | Sakshi
Sakshi News home page

అయ్యో సార్లూ.. ఇదేం తీరు..

Jan 27 2018 2:28 PM | Updated on Jan 27 2018 2:28 PM

republic day celebrations in sircilla - Sakshi

గణతంత్ర వేడుకల్లో ఉద్యోగులకు ఇచ్చే సేవా పురస్కార అవార్డుల్లో అధికారుల తీరుపై పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓ మహిళాధికారి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది.

సిరిసిల్లటౌన్‌: గణతంత్ర వేడుకల్లో ఉద్యోగులకు ఇచ్చే సేవా పురస్కార అవార్డుల్లో అధికారుల తీరుపై పలువురి నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఓ మహిళాధికారి ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. జిల్లా బీసీడీవో కార్యాలయంలో ఏబీసీడబ్ల్యూగా సంపూర్ణ ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని అధికారులు గురువారం రాత్రి ఫోన్‌చేసి అవార్డుకు ఎంపికైనట్లు చెప్పి ఆహ్వానించారు. దీంతో ఆమె శుక్రవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు వచ్చారు. తీరా అవార్డు ఇచ్చే సమయంలో బీసీ వెల్ఫేర్‌ శాఖకు అతీతంగా ఎస్సీ వెల్ఫేర్‌ శాఖకు చెందిన మరో వ్యక్తికి ఇచ్చారు. దీంతో ఏబీసీ డబ్ల్యూ సంపూర్ణ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఎస్సీ వెల్ఫేర్‌ శాఖను తమ శాఖలో పూర్తిగా విలీనం చేయకుండానే తమ శాఖకు చెంది న వారికి కాకుండా ఇతరలకు ఎలా ఇస్తారంటూ..రోదించారు.  అవార్డు వచ్చిం దని పిలిచి..అవమానిస్తారా అంటూ.. బీసీడివో అఫ్జల్‌మోహీయోద్దీన్‌తో వాగ్వాదానికి దిగారు. విషయాన్ని డీఆర్‌వో శ్యాంప్రసాద్‌లాల్‌ దృష్టికి తీసుకుపోయానని ఆమె వివరించారు. శాఖలో పనిచేసే అధికారుల వృత్తిలో ప్రతిభను ఉన్నతాధికారులకు నివేదించడమే మావంతని అవార్డులు ఇవ్వడం మా పరిధిలో లేదని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement