మూఢనమ్మకాలు విడనాడాలి

rally to create awareness against superstitions and child marriages - Sakshi

ధరూరు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూఢ నమ్మకాలను విడనాడి ముందుకు సాగాలని ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ రుక్మిణి అన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు మండలంలోని బురెడ్డిపల్లిలో ఆమె విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాలికా చదువులపై ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. బాలికలను బడికి పంపించి అక్షరాస్యతను పెంపొందించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 250 కుటుంబాల్లో సర్వే నిర్వహించి అన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. సర్పంచ్‌ బెనకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. 

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి
గద్వాల రూరల్‌: గ్రామంలో ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–2 ప్రోగ్రాం అధికారి సుందరమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని రేకులపల్లిలో ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రధాన వీధుల్లో ముళ్లపొదలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించారు.  సర్పంచ్‌ సుజాత, అధ్యాపకులు కృష్ణయ్య, భాస్కర్, వలంటీర్లు పాల్గొన్నారు. 

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top