చికాగోలో వైఎస్సార్ జయంతి వేడుకలపై నేతల భేటీ | Ysrcp leaders meeting on YSR jayanthi in chicago | Sakshi
Sakshi News home page

చికాగోలో వైఎస్సార్ జయంతి వేడుకలపై నేతల భేటీ

Jul 5 2016 9:22 PM | Updated on Jul 7 2018 3:19 PM

చికాగోలో వైఎస్సార్ జయంతి వేడుకలపై నేతల భేటీ - Sakshi

చికాగోలో వైఎస్సార్ జయంతి వేడుకలపై నేతల భేటీ

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రము చికాగో నగరములో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు.

అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రము చికాగో నగరములో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించారు. ఆటా వేడుకలలో భాగంగా మహానేత వైఎస్సార్ జయంతి భవిష్యత్ ప్రణాళికపై అమెరికా వైఎస్సార్ సీపీ కమిటీ భేటీ అయింది. అమెరికాలో వైఎస్ఆర్ సీపీ సలహాదారు, రీజనల్ ఇంచార్జి రమేష్ రెడ్డి వల్లూరు, ఇంచార్జి హరిప్రసాద్ లింగాల, కన్వీనర్లు రత్నాకర్ పండుగాయల, రాజశేఖర్ కేశిరెడ్డి, మధులిక, స్టూడెంట్ వింగ్ లీడర్ సాత్విక్ రెడ్డి గోకులముడి, చికాగో సిటీ ఇంచార్జి ఆర్‌ వెంకటేశ్వర రెడ్డి ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల భేటీ జరిగింది. ఈ సభకు ఆటా 25వ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్కే రోజా, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభకు వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ చికాగో సిటీ ఇన్‌చార్జ్‌ ఆర్‌ వెంకేటశ్వర రెడ్డి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పతనావస్థలో ఉందని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, దాంతో ఇకపైన కూడా అలాంటి నాయకులే రావాలని, కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అది ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారానే సాధ్యమౌతుందని నేతలు పేర్కొన్నారు. ‘ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నప్పుడు ఒక రాజకీయవేత్త రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు’ అని, అలాంటి వ్యక్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమవడమే కాక, యథేచ్ఛగా దోపిడీని సాగిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న ‘గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధనబలంతో రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబును నిలువరించాలంటే వైఎస్సార్‌సీపీ నిత్యం జనంతో మమేకం కావాలని సూచించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి భౌతికంగా దూర‌మై దాదాపు ఏడేళ్లు గ‌డుస్తున్నా ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నార‌న్నారు. వైయ‌స్సార్ అడుగుజాడ‌ల్లోనే వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి నిరంత‌రం ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం పాటుప‌డుతున్నార‌న్నారు. వైఎస్సార్ జయంతిని చూసి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని చెప్పారు. పార్టీ నిర్మాణ పరంగా బలమైన అడుగులు వేసేందుకు ఈ జయంతి కార్యక్రమం ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలని సూచించారు.

దుష్టశిక్షణా, శిష్టరక్షణా చేసేందుకు ఆనాడు శ్రీ కృష్ణుడు రథసారధిగా యుద్ధాన్ని ముందుండి నడిపించాడు, తెలుగుదేశం అరాచకాలను ఎండగట్టేందుకు , ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈనాడు ప్రజలే సారధులుగా సమరాన్ని సాగిస్తున్నారు. ఈ దరిద్రపు పాలన మాకొద్దు అంటూ జగనన్నతో కలసి సమరభేరి మోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. దొంగహామీలు, మాయమాటలతో మనల్ని మోసం చేసిన ఈ దుష్ట పచ్చ కౌరవులను, వారి పచ్చ రాజ్యాన్ని 'వైఎస్ జగన్' అనే వజ్రాయుధ సాయంతో కూకటివేళ్లతో పెకలించివేద్దాం' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ కమిటీ సభ్యులు, పలు రాష్టాల నుంచి విచ్చేసిన తెలుగువారు, విద్యార్థులు, వైఎస్‌ఆర్ అభిమానులు, వైఎస్‌ఆర్ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement