
తిరిగితే.. తల తిరుగుతుంది..
భూమికి 2,350 అడుగుల ఎత్తులో.. పర్వతం అంచున.. కింద మొత్తం పారదర్శకంగా ఉన్న గాజు రహదారి.. అక్కడ్నుంచి కిందకు చూస్తే.. వామ్మో.. ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం.
భూమికి 2,350 అడుగుల ఎత్తులో.. పర్వతం అంచున.. కింద మొత్తం పారదర్శకంగా ఉన్న గాజు రహదారి.. అక్కడ్నుంచి కిందకు చూస్తే.. వామ్మో.. ఎవరికైనా కళ్లు తిరగడం ఖాయం. ఫొటో చూస్తే తెలియడంలే.. చైనాలోని లాంగ్‌గ్యాంగ్ నేషనల్ జియోలాజికల్ పార్కులో ఇటీవల ప్రారంభించిన ఈ గ్లాస్‌వే ప్రపంచంలోనే అతి పెద్దదట. గుర్రపు నాడా ఆకారంలో కొండంచున 87.5 అడుగుల మేర విస్తరించి ఉంటుంది. రూ.35 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్‌వేపై మనం లెగ్ పెట్టాలంటే రూ. 600 కట్టాల్సి ఉంటుంది. 30 నిమిషాలపాటు దీనిపై తిరగొచ్చు.. మన తల తిరగకుంటేనే సుమా..