‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’

Woman Shares Her Engagement News With Grand Father Through Window - Sakshi

హృదయ విదారక సంఘటన. ఓ యువతి తన నిశ్చితార్థపు విషయాన్ని కిటికీ ద్వారా తన తాతతో పంచుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బుధవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని నర్సింగ్‌ విద్యార్థిని కార్లీ బోయ్డ్‌ అనే యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. నార్త్‌ కరోలినాలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో నివసిస్తున్న ఆమె తాత షెల్టాన్‌ మహాలా(87)తో ఈ విషయాన్ని కార్లీ పంచుకోవాలనుకుంది. కాగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ నిర్వహకులు ఆయనను కలుసుకునేందుకు అనుమతించలేదు. (కరోనా అలర్ట్‌ : మాస్క్‌లు, గ్లోవ్స్‌ కంటే ఇదే ముఖ్యం)

దీంతో కార్లీ నేరుగా ఆ సెంటర్‌కు వెళ్లి తన తాత ఉండే గది వెనుకకు వెళ్లింది. అక్కడ ఉన్న అద్దం కిటికీ నుంచే తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ భావోద్యేగానికి లోనయ్యింది. అలా కార్లీ అద్దంపై చేయి ఉంచగా.. ఆమె తాత కూడా చేతిని తాకుతున్నట్లుగా అద్దంపై చేయి ఉంచాడు. ఇక ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 2 లక్షలకు పైగా లైక్‌లు రాగా వేలల్లో కామెంట్లు వచ్చాయి. ‘ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ ‘ఈ సంఘటన చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. వారి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే ముచ్చటగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. (కరోనా అసలైన మాత్ర.. ధైర్యం 500 ఎం.జి. )

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్‌ సొకకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ జనసముహాం ఉండకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. అక్కడి నర్సింగ్‌ హోమ్స్‌, రిహబిటేషన్‌ సెంటర్లలో ఉన్న తమ వారిని కలిసేందుకు రోజుకు కొంత మందిని మాత్రమే అనుమతినిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top