గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్‌ | Wireless charging | Sakshi
Sakshi News home page

గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్‌

Feb 19 2017 2:31 AM | Updated on Sep 5 2017 4:02 AM

గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్‌

గదిలో ఉన్న అన్ని పరికరాలకు ఒకేసారి చార్జింగ్‌

రూమ్‌లో ఎక్కడున్నా వైర్‌లెస్‌ విధానం ద్వారా ఒకే సారి అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలకు చార్జింగ్‌ పెట్టుకునే సరికొత్త

వాషింగ్టన్ : రూమ్‌లో ఎక్కడున్నా వైర్‌లెస్‌ విధానం ద్వారా ఒకే సారి అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలకు చార్జింగ్‌ పెట్టుకునే సరికొత్త విధానాన్ని డిస్నీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా ఒకేసారి సెల్‌ఫోన్లు, ఫ్యాన్లు, లైట్లను రీచార్జ్‌ చేయవచ్చు. ఈ నూతన ఆవిష్కరణలో విద్యుత్‌ శక్తి వైఫై తరంగాల మాదిరిగా మారుతుందని డిస్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రధాన పరిశోధక శాస్త్రవేత్త అలెన్ సన్ శాంపిల్‌ పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ ఫలితంగా భవిష్యత్తులో రోబోట్‌లు, మొబైల్‌ పరికరాల వంటి వాటిలో బ్యాటరీలు, వైర్లు అవసరం లేకుండా చేయవచ్చని అలెన్ సన్  తెలిపారు.

ఈ వైర్‌లెస్‌ పవర్‌ను సాధారణ గది పరిమాణానికి సరఫరా చేయగలుగుతున్నామని, కాని దీన్ని ఒక చిన్న బొమ్మ స్థాయికి తగ్గించడంకానీ, ఒక పెద్ద వేర్‌హౌస్‌ స్థాయికి పెంచడంగాని చేయలేకపోతున్నామని, ఈ విషయంలో పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. వైర్‌లెస్‌ పవర్‌ ట్రాన్స్ మిషన్  అనేది దీర్ఘకాలిక సాంకేతిక స్వప్నమని అలెన్సన్ అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లా 1980లో వైర్‌లెస్‌ లైటింగ్‌ సిస్టంను కనుగొన్నారని, ఈ విధానంతో దూర ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేయడం, గృహాలకు వైర్‌లెస్‌ విధానం ద్వారా విద్యుత్‌ సరఫరా చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అలెన్ సన్  చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement