మోదీతో వీటిని పంచుకోవాలనుకున్నా: మోరిస్‌ | Will Enjoy Samosas Together PM Modi On Australian PMs | Sakshi
Sakshi News home page

భారత ప్రధానితో వీటిని పంచుకోవాలనుకున్నా: మోరిస్‌

Jun 1 2020 10:34 AM | Updated on Jun 1 2020 10:52 AM

Will Enjoy Samosas Together PM Modi On Australian PMs - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో జూన్‌ 4న వీడియో భేటీలో పాల్గొననున్న సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిస్‌ ఆదివారం సమోసాల ఫొటోలను కొన్నింటిని ట్వీట్‌చేశారు. వీటిని మోదీతో కలిసి ఆస్వాదించాలని ఉందని వ్యాఖ్యానించారు. వాటికి 'స్కమోసా'లని కొత్త పేరు పెట్టారు. ‘ఆదివారం మామిడికాయ చట్నీతో స్కమోసాలు. భారత ప్రధానితో వీటిని పంచుకోవాలనుకున్నా.. కానీ దురదృష్టవశాత్తూ అది వీడియో లింక్‌ భేటీ’ అని మోరిసన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందనగా మోదీ ‘హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానం.. భారతీయ సమోసాల ద్వారా అనుబంధం’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement