వాట్స్‌యాప్‌తో విడాకులు! | whatsapp divorced | Sakshi
Sakshi News home page

వాట్స్‌యాప్‌తో విడాకులు!

Nov 18 2014 12:44 AM | Updated on Jul 26 2018 5:21 PM

వాట్స్‌యాప్‌తో విడాకులు! - Sakshi

వాట్స్‌యాప్‌తో విడాకులు!

ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల కారణంగా పెళ్లి పెటాకులవుతున్న సంఘటనలకు మరో ఉదాహరణ తాజాగా సౌదీ అరేబియాలో జరిగింది.

సౌదీ అరేబియా: ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల కారణంగా పెళ్లి పెటాకులవుతున్న సంఘటనలకు మరో ఉదాహరణ తాజాగా సౌదీ అరేబియాలో జరిగింది. వాట్స్‌యాప్‌లో ఎన్ని మెస్సేజ్‌లు పంపినా.. పట్టించుకోవడం లేదంటూ సౌదీకి చెందిన ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చేశాడు. స్నేహితులు, పుట్టింటివారితో గంటల తరబడీ చాటింగ్ చేస్తూ గడుపుతున్న తన భార్య వాట్స్‌యాప్‌లో తన మెస్సేజ్‌లను మాత్రం చదవడం లేదని వెల్లడిం చాడు.

ఆమెను మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యాయని చివరకు తీవ్రంగా విసిగిపోయి విడాకులు ఇచ్చానని తెలిపాడు. తన మెస్సేజ్‌లను ఆమె కనీసం చదవడం లేదని వాట్స్‌యాప్‌లో బ్లూ టిక్స్ ఆప్షన్ ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాడు.

అయితే.. తాను తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ కొంచెం బిజీగా ఉన్న మాట వాస్తవమేనని సదరు భార్య అంగీకరించినా.. అది కొంచెం కాదని, కుటుంబాన్ని, సొంత బిడ్డనూ పట్టించుకోనంతటి టూ మచ్ బిజీ అని ఆ భర్తను ఉటంకిస్తూ ‘గల్ఫ్ న్యూస్’ ఓ కథనంలో పేర్కొంది. అన్నట్టూ.. బ్రిటన్‌లో విడాకులు తీసుకున్న జంటల్లో మూడో వంతుకుపైగా తమ ఫిర్యాదుల్లో ‘ఫేస్‌బుక్’నే కారణంగా చూపించారని ‘డైవోర్స్ ఆన్‌లైన్’ సంస్థ సర్వేలో వెల్లడి కావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement