సోనియాపై ఫిర్యాదుకు అమెరికా కోర్టు తిరస్కృతి | US court dismisses anti-sikh riots case against Sonia gandhi | Sakshi
Sakshi News home page

సోనియాపై ఫిర్యాదుకు అమెరికా కోర్టు తిరస్కృతి

Jul 11 2014 2:16 AM | Updated on Oct 22 2018 9:16 PM

సోనియాపై ఫిర్యాదుకు అమెరికా కోర్టు తిరస్కృతి - Sakshi

సోనియాపై ఫిర్యాదుకు అమెరికా కోర్టు తిరస్కృతి

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సిక్కు హక్కులగ్రూపు చేసిన సవరణఫిర్యాదును అమెరికాకోర్టు తిరస్కరించింది.

న్యూయార్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సిక్కు హక్కులగ్రూపు చేసిన సవరణఫిర్యాదును అమెరికాకోర్టు తిరస్కరించింది. అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్‌జేఎఫ్) అనే సంస్థ 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి గతంలో సోనియాపై హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదును గత నెలలో విచారించిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బ్రియాన్ కోగెన్ సరైన ఆధారాలు లేవంటూ కొట్టేశారు. తాజాగా ఎస్‌జేఎఫ్ ప్రతినిధులు సోనియాపై సవరణ ఫిర్యాదును నమోదు చేయాలని కోరుతూ కోగెన్‌కు లేఖ రాశారు. ఈ కేసులో తుదితీర్పు వెలువడింద ని, తదుపరి విచారణకు సరైన ఆధారాలు లేవని కోగెన్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement